30, డిసెంబర్ 2020, బుధవారం
21, డిసెంబర్ 2020, సోమవారం
టిటిడిలో డిప్యూటీ ఈవో డిప్యుటేషన్ వివాదం...!
టిటిడిలో ఆరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) పోస్టుల్లో ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై నియమించే అవకాశం వుంది. ఇందులో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే సమయంలో టిటిడి ఐటి విభాగానికి ఒక నిపుపుడు కావాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న పి.శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై డిప్యూటీ ఈవోగా తీసుకొస్తున్నారు.
ఇక్కడ సాంకేతికపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. డిప్యూటీ ఈవోగా రావాలంటే ఆర్‌డిఓ స్థాయి అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుందని, అటువంటి పోస్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను నియమించడం సరైనది కాదని టిటిడి ఉద్యోగులు అంటున్నారు. శ్రీనివాసరావును టిటిడి ఐటి విభాగంలో నియమిస్తే....ఆయన కంటే ఎక్కువ హోదా కలిగిన అధికారులు ఎలా పని చేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. - ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి